సాయిబాబాను విడుదల చేయండి: ఐక్యరాజ్య సమితి

saibabaఢిల్లీ యూనివర్శిటీ సాయిబాబాను విడుదల చేయాలని భారత్ ను ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. మావోలతో సంబంధాలున్నాయనే కారణంతో ప్రభుత్వం జీవితఖైదు విధించడం హక్కుల ఉల్లంఘనే అని తెలిపింది.

సాయిబాబా 15కు పైగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ..వీల్ చైర్ కే పరిమితమైన  వ్యక్తిని  బంధించి  ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. 2014లో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సాయిబాబాను అరెస్టు చేసి గడ్చిరోలి సెషన్స్ కోర్టుకు తరలించింది.  2017  మార్చిలో సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది కోర్టు. అప్పటి నుంచి సాయిబాబా నాగ్‌పూర్ జైలులో ఉన్నారు. ఒక చీకటి గదిలో పరిసరాలు శుభ్రం లేని గదిలో సాయిబాబాను బంధించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయిబాబాకు వెంటనే చికిత్స అందించాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం సభ్యులు తెలిపారు. దివ్యాంగుడైన సాయిబాబాను చీకటి గదిలో బంధించడం అనైతికం అని వారు భారత్‌కు రాసిన లేఖలో తెలిపారు. కార్పోరేట్ విధానాలపై సుదీర్ఘంగా పోరాటం చేసిన వ్యక్తిగా సాయిబాబా నిలిచారన్నారు యూఎన్ సభ్యులు.

Posted in Uncategorized

Latest Updates