సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి శోభ

గురుపూర్ణిమా సందర్భంగా శుక్రవారం (జూలై-27) సాయిబాబా ఆలయాలు ముస్తాబైయ్యాయి. బాబా సమాధి శతాబ్ధి ఉత్సవాల్లో ప్రత్యేకమైన రోజు కావటంతో… విద్యుత్ దీపాలతో టెంపుల్స్ ను అలంకరించారు. గురుపౌర్ణమిసందర్భంగా షిరిడితోపాటు తెలుగురాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి సాయిబాబాను దర్శించుకుంటున్నారు. దీంతో సాయిబాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.

 

రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ గ్రామంలో శ్రీ సద్గురు సాయిబాబా మందిరాన్ని పువ్వులు, మామిడి తోరణాలతో తీర్చిదిద్దారు. స్వామివారికి ప్రత్యేకమైన రోజు కావటంతో… భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే పూజాకార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates