సారీ.. నిధుల్లేక క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఆపేస్తున్నాం.. బిల్డర్స్ వింత ప్రకటన

హైదరాబాద్ : పలు జిల్లాల్లో బ్రిడ్జీలు.. రోడ్లు పనుల ఎక్కడికక్కడే ఆగిపోయాయి. సగం కట్టిన బ్రిడ్జీని… సగం వేసిన రోడ్డును… రోడ్డుకోసం అడ్డంగా తవ్వేసిన రహదారిని అలాగే వదిలేశారు కొందరు బిల్డర్లు, కాంట్రాక్టర్లు. ఇందుకు వారు చెప్పే కారణం కూడా జనానికి షాకిస్తోంది.

పనులు ఆగిపోయిన కారణాన్ని వివరిస్తూ.. పలుచోట్ల “బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా – తెలంగాణ స్టేట్” తరఫున బ్యానర్లు కట్టారు. అందులో.. “ప్రజలకు విజ్ఞప్తి. ఈ రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాం. మేము చేసిన పనులకు ప్రభుత్వం నిధులు చెల్లించనందుకు మిగిలిన పని పూర్తిచేయలేకపోతున్నాం. దీని వల మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మాకు బిల్లులు వచ్చిన వెంటనే తిరిగి పని ప్రారంభిస్తాం”  అని ఉంది.

ఇలాంటి బ్యానర్లు ఇపుడు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పనులు జరుగుతున్న దగ్గర కనపడుతున్నాయి. బ్రిడ్జి సగమే కట్టినా.. సగం రోడ్డు వేసినా… మిగతాది పూర్తికావడానికి టైమ్ పడుతుందంటున్నారు బిల్డర్స్ అసోసియేషన్.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మూలవాగు బ్రిడ్జి నిర్మాణ పనులు నిధులు లేక నిలిపివేశామని, చేసిన పనులకు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని ఫ్లెక్సీ పెట్టారు. అటు జనగామ జిల్లా జిడికల్ నుంచి యాదాద్రి జిల్లా మోత్కూర్ వరకు డబుల్ రోడ్డు పనులు ఆగిపోవడంపై కాంట్రాక్టర్ ఫ్లెక్స్ ప్రదర్శించాడు.

Posted in Uncategorized

Latest Updates