సాహిత్య అభివృద్ధికి.. సారస్వత పరిషత్ ఎంతో కృషి : వెంకయ్య

VENKAIAHతెలంగాణ సారస్వత పరిషత్ కి చాలా చరిత్ర ఉందని..తెలుగు, సాహిత్యఅభివృద్ధికి సారస్వత పరిషత్ ఎంతో కృషి చేసిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.  శనివారం (మే-26) సారస్వత పరిషత్తు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు వెంకయ్య. తరతరాలుగా మన తెలుగు భాషమీద దాడులు జరిగాయని, ఈ క్రమంలోనే మన తెలుగును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మన కళలు సరస్వతిదేవి మనకు ఇచ్చిన వరాలని.. సరస్వతిదేవి మనకు ఉంటే లక్ష్మీ వస్తుందన్నారు ఉపరాష్ట్రపతి. వివేకం..చైతన్యం దానంతట అది రాదని, అది విద్యతోనే వస్తుందన్నారు. ఆధునికత పేరుతో పరాయిభాషపై మోజు పెంచుకుంటున్నారని తెలిపిన వెంకయ్య..తెలంగాణ రాష్ట్రంలో తెలుగుభాషా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ కృషిని అభినందించారు. ప్రపంచ తెలుగు మహాసభలు..వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగవైభవంగా జరిపిందన్నారు. తెలుగు భాషా సంరక్షణ కోసం కాలేజీల్లోనూ తెలుగు భాషను తప్పనిసరి చేశారన్నారు. చారిత్రక ఘట్టాలను గుర్తుంచుకోకపోతే..అమరవీరుల త్యాగాలను మరిచినవాళ్లమవుతామన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ..అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడని..75 సంవత్సరాలుగా వస్తున్న సారస్వత పరిషత్ లో మార్పులను ప్రస్తుతం యువతకు అనుగుణంగా భాషలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates