సాహిత్య అకాడమి అవార్డ్ గ్రహీత మునిపల్లి కన్నుమూత

munipalli raju4కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ గ్రహిత, సినీ రచయిత మునిపల్లె రాజు (92) కన్నుమూశారు. హైదరాబాద్ సైనిక్ పురిలోని తన నివాసంలో ఫిబ్రవరి 24వ తేదీ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. స్నేహితులు, అభిమానులు నివాళులర్పించారు.

మునిపల్లి రాజు గుంటూరు జిల్లాలో 1925లో జన్మించారు. 12ఏళ్ల వయస్సు నుంచే కథలు రాయటం ప్రారంభించారు. దివో స్వప్నాలతో ముఖాముఖి, అశ్విత్వనదం అవలి తీరాన, పుష్పాలు- ప్రేమికులు-పశువులు, అలసిపోయినవాడి అరణ్యకాలు, ఈతరం కోసం కథా స్రవంతి వంటి వందకుపైగా పుస్తకాలు రచించారు. మునిపల్లి రాజుకు భార్య సులోచనదేవి, ముగ్గురు కూమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రముఖులు ఆయన బౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Posted in Uncategorized

Latest Updates