‘సాహో’తరువాతే ప్రభాస్ పెళ్లి ?

Prabhas‘సాహో’ చిత్రం  విడుదలయిన తరువాత పెళ్లి చేసుకుంటాడటా ప్రభాస్…ఈ విషయం స్వయంగా అతనే చెప్పాడు. అభిమానులు కూడా తమ ‘బాహుబలి’ ఓ ఇంటివాడైతే చూడాలని ఎంతో ముచ్చటపడుతున్నారు. కానీ ప్రభాసేమో ఇదివరకు ‘బాహుబలి’ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానన్నారు. ఇప్పుడు ‘సాహో’ సినిమా తర్వాత చేసుకుంటానని మాట మార్చాడు.

ప్రభాస్‌ పెళ్లి విషయమై ఇటీవల ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. పెళ్లి చేసుకోమని తాను కూడా ప్రభాస్‌ను బలవంతపెడుతున్నానన్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం త్వరలో చేసుకుంటానని చెప్తూనే ఉన్నాడని చెప్పారు. అలాగని ప్రతిసారి పెళ్లి చేసుకోమని చెప్పడానికి ప్రభాసేమీ చిన్నపిల్లాడు కాదన్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌..‘సాహో’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత కూడా ఆయన పెళ్లి చేసుకుంటారో…లేక మళ్లి వాయిదా వేస్తారో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పాతకాలం నాటి చిత్రంలో ప్రభాస్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 1970 లో జరిగిన ఓ ప్రేమకథ ద్వారా రూపొందిస్తున్నారటా. కథ ప్రకారం యూరప్‌లోనే ఎక్కువ భాగం తీస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తయిన తరువాత పెళ్లి చేసుకుంటానని బాహుబలి ప్రకటిస్తాడేమోనని ఆందోళన చెందుతున్నారు ఆయన అభిమానులు.

 

Posted in Uncategorized

Latest Updates