సాహోలో ప్రభాస్ స్టిల్స్…

DdKbA1FX0AItOk0బాహుబ‌లి చిత్రంతో అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన హీరో ప్ర‌భాస్‌ పై ఇప్పుడు తెలుగులోనే కాదు హిందీలోను భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ర‌న్ రాజా ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం సాహో సినిమా చేస్తున్నాడు ప్ర‌భాస్. ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బేనర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది.

ప్ర‌స్తుతం ఈ చిత్రం దుబాయ్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్పుడు సాహో మూవీ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌లో బైక్‌ మీద కూర్చున్న స్టిల్స్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. తాజాగా న‌టుడు అరుణ్ విజ‌య్ సాహో సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అరుణ్ షేర్ చేసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డ‌మే కాదు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతున్నాయి. శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సాహో ఒక నవల తరహాలో కొనసాగే యాక్షన్ డ్రామా కాగా ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ , జాక్ ష్రాఫ్ , చుంకీ పాండే,అరుణ్ విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates