సాహో సైనికా..ప్రాణాలను కాపాడిన జవాన్లు

 రాజస్థాన్ : దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి బార్డర్ లో డ్యూటీ చేసే సైనికులు..వాళ్ల కళ్లముందు ఎలాంటి ఆపద కనిపించినా చాలు.. కలిసికట్టుగా రక్షించే బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తుపాను సమయంలోనే కాకుండా ప్రజలకు ప్రమాద సమయాల్లోనూ ఆదుకుంటూ నిజమైన రక్షకభటులు అనిపించుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణే  రాజస్థాన్ లో నిన్న(డిసెంబర్-6) న జరిగిన ఘటన.

ఎలక్షన్స్ లో ఓ ఫ్యామిలీ ఓటు వేయడానికి సొంత ఊరు వెళ్తుండగా బ్రిడ్జిపై నుండి అదుపుతప్పి లోయలో పడింది. వెనకాలే వస్తున్న సైనికులు ఇది గమనించి వెంటనే కారును లేపారు. కారులో ఉన్నవారిని క్షేమంగా బయటికి తీశారు. కాస్త సమయం అటు ఇటు అయినా ఊపిరాడక 5 మంది చనిపోయేవారిమని తెలిపారు ఫ్యామిలీమెంబర్స్. దేవుడిలా వచ్చి తమ ప్రాణాలను కాపాడారని కన్నీరుమున్నీరయ్యారు కారులో ప్రయాణించినవారు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా..సాహో సైనికా అంటు కితాబిస్తున్నారు నెటిజన్లు.

 

Posted in Uncategorized

Latest Updates