సాహో సైనికా : 2500 మంది ప్రాణాలను కాపాడారు

సిక్కిం :  మంచులో చిక్కుకున్న 2వేల 500 మంది టూరిస్టులను కాపాడింది భారత ఆర్మీ. సిక్కిం రాష్ట్రం… ఇండియా- చైనా సరిహద్దులోని నాథు లా అనే ప్రాంతంలో శుక్రవారం భారీ స్థాయిలో మంచు కురిసింది. అప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న 2500 మంది టూరిస్టులు …  మంచు వర్షంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న భారత ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేసింది. స్నో ఫాల్ లో చిక్కుకున్న వారిని.. సురక్షితంగా హెల్ప్ సెంటర్ లకు తీసుకొచ్చారు. భారీగా మంచు కురవడంతో అందులోనే కూరుకుపోయామని.. సరైన సమయానికి మిలిటరీ వచ్చి, తమ ప్రాణాలను కాపాడిందని తెలిపారు టూరిస్టులు.

Posted in Uncategorized

Latest Updates