సింగపూర్ లో భద్రత ఇదీ: ప్రతి అడుగు పట్టేస్తారు

Kim-Trump-summit-in-Singaporeఅమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌లు.. సింగపూర్‌ వేదికగా కీలక చర్చలు జరపనున్నారు. ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణకు ఒప్పించడమే ప్రధాన ఎజెండాగా సింగపూర్‌లోని కపెల్లా హోటల్లో అమెరికా, ఉ.కొరియా అధినేతల మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఏడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇందులో అత్యంత కీలకమైనది మూడో అంచెలోని నేపాలీ కమెండోల భద్రతా వలయం. దాదాపు 1600 నేపాలీ గూర్ఖాలు మూడో అంచెల  భారీ భద్రతతో పహారా కాస్తున్నారు. వారి కనుసన్నల్ని దాటి చీమ కూడా లోపలికి ప్రవేశించలేదు. ఎవరైనా ఉల్లంఘించి దూసుకొచ్చారో వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తుందీ దళం.తలపై ముదురుగోధుమ రంగు టోపీ, చేతిలో ఖడ్గంతోపాటు రైఫిల్‌ వీరి వద్ద ఉంటుంది. ఈ బృందం హోటల్, దీవి భద్రతను చూస్తోంది.

సదస్సు కవరేజీకి దాదాపు 100 దేశాల నుంచి సుమారు 3000 పైచిలుకు మీడియా ప్రతినిధులు సింగపూర్‌ చేరుకున్నారు. వీరిలో ఆసియా దేశాల నుంచే ఎక్కువ. దాదాపు అన్ని అమెరికన్‌ ఛానెల్స్‌ రెండు లేదా మూడు బృందాలను పంపాయి. ఒక శిఖరాగ్ర సదస్సు కోసం ఇంతమంది జర్నలిస్టులు రావడం ఆసియాలో ఇదే ప్రథమమని అంటున్నారు. వీరందరికీ ఇంటర్నేషనల్‌ మీడియా సెంటర్‌లోనే అన్నీ సమకూర్చారు. అక్కడికి సమీపంలోని స్టార్‌ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు.

కిమ్‌-ట్రంప్‌ శిఖరాగ్ర సదస్సులో భారతీయ వంటకాలు కూడా భారీగానే ఏర్పాటవుతున్నాయి. పులావ్‌, చికెన్‌ కుర్మా, చేపల కూర, దాల్‌, చికెన్‌ కర్రీ, అప్పడం, పుట్టగొడుగుల వేపుడు… మొదలైనవి పెట్టారు. ఒక్క భారతీయ వంటకాలయిన చికెన్‌ కుర్మా, పులావ్, ఫిష్‌ కర్రీ, దాల్, పాపడ్‌ తో పాటు..సింగపూర్‌, మలేషియా, ఇటాలియన్‌, చైనీస్‌, అమెరికన్‌, జపనీస్‌, వియత్నామీస్‌, కొరియన్‌, థాయ్‌, ఫ్రెంచ్‌, పశ్చిమాసియా దేశాల ప్రత్యేక వంటకాలూ పెట్టారు. క్యాబేజీతో చేసిన స్పైసీ కొరియన్‌ ఫుడ్‌ అక్కడ ప్రత్యేక ఆకర్షణ. జర్నలిస్టుల భోజన ఏర్పాట్లను సింగపూర్‌కు చెందిన కామన్‌గుడ్‌ సంస్థ చూస్తోంది.

Posted in Uncategorized

Latest Updates