తండ్రులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏడాది పాటు చైల్డ్ కేర్ లీవ్స్

2019 కొత్త ఏడాది రాకకుముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన సింగిల్ పేరెంట్ తండ్రులకు శుభవార్త అందింది. బిడ్డల ఆలనాపాలనా చూసే తండ్రులకు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు(చైల్డ్ కేర్ లీవ్స్-సీసీఎల్) ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలులోకి తెస్తోంది. బిడ్డలను చూసుకునేందుకు తల్లి లేని పక్షంలో ఉద్యోగిగా పనిచేస్తున్న తండ్రి ఈ సెలవులు పెట్టుకునేందుకు అర్హత ఉంటుంది. ఉద్యోగులైన ఆడవారికి మెటర్నిటీ లీవ్ రూపంలో ఇప్పటికే ఇటువంటి వెసులుబాటు ఉంది. కేంద్రప్రభుత్వ మహిళా ఉద్యోగి అయితే ఓ రకంగా… రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగి అయితే మరో రకంగా.. ప్రైవేటు కంపెనీ మహిళా ఉద్యోగి అయితే ఇంకో రకంగా.. ఇలా వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. తల్లిలేని పిల్లలు ఇబ్బంది పడకూడదని.. సింగిల్ పేరెంట్ తండ్రులకు 365 రోజుల పాటు.. పూర్తి వేతనంతో సెలవులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా హాఫ్ పేమెంట్ తో 750రోజుల వరకు సెలవులు పెట్టవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్  నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

Posted in Uncategorized

Latest Updates