సింహం సింగిల్ గానే వస్తుంది : కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా ఉండే గ్రామ పంచాయతీల్లో పండుగవాతావరణంలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఘనత TRS ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం(జూలై-30) సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు పించన్లు ఇస్తున్నామని..గతంలో కంటే 7 రెట్లు ఎక్కువగా ఇస్తున్నామన్నారు.

కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మీ, 24 గంటల కరెంటు, రైతుబందు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టించిందన్నారు. కేసీఆర్ రాజ్యం రామరాజ్యమని..భూమి శిస్తును వసూలు చేయడం రద్దు చేయడమే కాకుండా..పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నారన్నారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పిన కేటీఆర్..కంటి వెలుగుతో అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వ్యవసాయానికి పెద్ద పీఠ వేసిన కేసీఆర్..గొర్రెలు. బర్రెలు, చేపల పంపిణీ చేస్తున్నామన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో తల్లిదండ్రులు కూడా చూసుకోలేని విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్న కేటీఆర్..తెలంగాణ సస్యశ్యామలం కావాలన్నారు. మంచి పనులు చేస్తుంటే కేసీఆర్ పై కావాలనే రాద్దాంతం చేస్తున్నారన్నారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ చేయలేని పనులను చేస్తున్నామని కడుపుమంటతోనే మాట్లాడుతున్నారన్నారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్నట్లుగా కాంగ్రెస్ వ్యవహారిస్తుందన్నారు. అభివృద్ధి చేస్తుంటే కావాలనే అడ్డంకిగా మారారు. చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా కాంగ్రెస్ ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు మంత్రి కేటీఆర్.

నాలుగేళ్లలోనే బంగారు తెలంగాన సాధ్యంకాదని..ఆ దిశగా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఎంతమంది ఏకమైనా పందులే గుంపులుగా వస్తాయని..సింహం సింగిల్ గానే వస్తుందని కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు కేటీఆర్. అనంతరం అమరవీరుల కుటుంబాలకు చెక్కులను అందజేశారు మంత్రి కేటీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates