సింహాల రక్షణకు వెయ్యి కోట్లు ఇవ్వండి

అంతుచిక్కని వ్యాధితో చనిపోతున్న గుజరాత్‌ గిర్‌ మృగరాజుల రక్షణకు వెంటనే వెయ్యి కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ పటేల్‌ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అలాగే వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ, పర్యవేక్షణ లోపంతోనే సింహాలు మృతి చెందాయని ఆరోపించారు. గిర్‌ అటవీ సమీపంలోని అక్రమ రిసార్ట్స్‌లను వెంటనే తొలిగించాలని, గుజరాత్‌ సింహాల రక్షణ కోసం వెయ్యికోట్ల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గుజరాత్‌ సింహాలకు పులులకిచ్చే ప్రాధాన్యతనే ఇస్తూ.. టైగర్‌ ప్రాజెక్ట్‌లా లయన్స్‌ ప్రాజెక్ట్‌ చేపట్టాలని సూచించారు.

గిర్‌ సింహాలు వ్యాధుల భారిన పడకుండా…మెడిసిన్స్‌ను తెప్పించాలని, సింహాల కోసం వెటర్నరీ డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతుపట్టని రోగాలు, ప్రాణాంతక వైరస్‌తో దాదాపు 15 రోజుల్లోనే 23 సింహాలు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

అడవులకు దగ్గరగా జనావాసాలు విస్తరించడంతో అంతుచిక్కని వ్యాధులతో పాటు గొర్రెలు, మేకలు ఇతర పెంపుడు జంతువుల నుంచి సింహాలకు సోకుతున్న వైరస్‌ ఈ మరణాలకు కారణమంటున్నారు నిపుణులు.

Posted in Uncategorized

Latest Updates