సికింద్రాబాద్‌ నుంచి గౌహతికి 52 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌-కామాఖ్య (గౌహతి) మధ్య 52 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌ కుమార్‌.

సికింద్రాబాద్‌-కామాఖ్య స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07149) సికింద్రాబాద్‌ నుంచి ఆగస్టు 3, 10, 17, 24, 31, సెప్టెంబరు 7, 14, 21, 28, అక్టోబర్ 5, 12, 19, 26, నవంబరు 2, 9, 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28, జనవరి 4, 11, 18, 25వ తేదీల్లో (శుక్రవారం) ఉదయం 7.30గంటలకు బయల్దేరి, ఆదివారం ఉదయం 8.20గంటలకు కామాఖ్య చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో… కామాఖ్య-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07150) కామాఖ్య నుంచి ఆగస్టు 6, 13, 20, 27, సెప్టెంబరు 3, 10, 17, 24, అక్టోబరు 1, 8, 15, 22, 29, నవంబరు 5, 12, 19, 26, డిసెంబరు 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21, 28వ తేదీల్లో (సోమవారం) ఉదయం 5.42గంటలకు బయల్దేరి, బుధవారం ఉదయం 9.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

Posted in Uncategorized

Latest Updates