సికింద్రాబాద్ లో నిర్భ‌య త‌ర‌హా ఘ‌ట‌న

rapeసికింద్రాబాద్ లో మ‌రో నిర్భ‌య ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆర్మీజవాన్ కూతురిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. రెండు నెల‌ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

తిరుమలగిరిలో తొమ్మిదో చదువుతున్న మిలటరీ జవాను‌ కుమార్తె తన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్తున్న సమయంలో అమ్ముగూడ రైల్వే ట్రాక్ దగ్గర దగ్గర స్నేహితుడిని కలిసింది. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత..ఆ ఫ్రెండ్ వెళ్లిపోయాడు. ఇంతలో ట్రాక్ దగ్గరకు వచ్చిన ఓ 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి బాలికను అడ్డగించి బెదిరించాడు. తర్వాత చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. అరవకుండా కొట్టి… తీవ్రంగా గాయపడిన బాలికపై అత్యాచారం జరిపి పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన బాలికను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు కలవడానికి వెళ్లిన స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడా? లేక ఎవరైనా అత్యాచారం చేశారా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే సంఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నా నిందితుడిని పట్టుకోవడంతో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates