సిక్కు మహిళలకు నో హెల్మెట్ : కేంద్రం

ఢిల్లీ : హెల్మెట్ తప్పనిసరి..లేకుంటే ప్రాణాలకే ముప్పు. హెల్మెట్ లేదా..అయితే ఫైన్ కట్టాల్సిందే. రాఖీ కట్టు హల్మెట్ పెట్టు. ఈ మాటలు మాకు వర్తించవు అంటున్నారు సిక్కు మహిళలు. టూ వీలర్ నడిపే సిక్కు మహిళలు ఇక నుంచి హెల్మెట్ వాడాల్సిన అవసరం ఉండదు. వీటి వాడకం నుంచి మినహాయింపునిస్తూ.. చండీగఢ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇవాళ (అక్టోబర్-11) సిక్కు మత ప్రతినిధులు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీలో కలిశారు.

ఈ సందర్భంగా సిక్కు మహిళలకు హెల్మెట్ ధరించడంపై మినహాయింపును ఇవ్వాలని కోరారు. అకాలీదళ్ నాయకులు కూడా కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మినహాయింపు చట్టంలో సవరణలు చేస్తూ, ఢిల్లీ రవాణా శాఖ విధానాలు పాటించాలని హోం మంత్రిత్వ శాఖ చండీగఢ్ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాల బారినుంచి హెల్మెట్ రక్షణకవచంలా ఉంటుందని..అలాంటిది ఈ నిర్ణయం సరికాదంటున్నారు. ఓ వైపు హెల్మెట్ వాడకంపై అవేర్ నెస్ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ..హెల్మెట్ బ్యాన్ అనే నిర్ణయాలు సరైనవి కావంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates