సిక్సుల మోత : చెన్నై సూపర్ విక్టరీ

sixఐపీఎల్-11లో సూపర్ విక్టరీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. హోమ్ గ్రౌండ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన టెన్షన్ మ్యాచ్ లో అదిరిపోయే విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఒక బాల్  మిగిలి ఉండగానే ఛేదించి, ఐదు వికెట్ల తేడాతో సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీకొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్  చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కేకేఆర్. ఆండ్రూ రసెల్  చెన్నై సూపర్ కింగ్స్  బౌలింగ్ ను ఊచకోత కోస్తూ.. 36 బంతుల్లో 11 సిక్సర్లు, 1 ఫోర్ తో 88 పరుగులు చేశాడు. జట్టుకు భారీస్కోరు అందించాడు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నైకి .. వాట్సన్ , రాయుడు బుల్లెట్ బిగినింగ్ ఇచ్చారు. బిల్లింగ్స్  క్లైమాక్స్ వరకు తీసుకెళ్లాడు. చివరి ఓవర్లో 17 రన్స్ కావాల్సి ఉండగా… బ్రావో, జడేజా చెరో సిక్సర్ బాది సూపర్ కింగ్స్ కు కళ్లుచెదిరే విజయాన్ని అందించారు. 2 బాల్స్ లో 4 రన్స్ కావాల్సినప్పుడు జడేజా కొట్టిన సిక్సర్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.

 

Posted in Uncategorized

Latest Updates