సిగరెట్లు తాగితే జైల్లో పెడతా : ఒక్కరోజు పోలీస్ కమిషనర్ చిన్నోడు ఆశయం

make-a-wishఒకే ఒక్కడు సినిమాలో ఒక్క రోజు సీఎంలాగే.. హైదరాబాద్ లో ఒక్క రోజు పోలీస్ కమిషనర్ బాధ్యతలు చేపట్టాడు ఏడేళ్ల చిన్నారి ఇషాన్. కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఇషాన్. ఆ చిన్నారి కోరిక కమిషనర్ ఆఫ్ పోలీస్ కావడం. ఇది తెలుసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఇషాన్ కోరిక తీర్చాడు. ఏప్రిల్ 4వ తేదీ బుధవారం ఒక్క రోజు రాచకొండ సీపీగా బాధ్యతలు అప్పగించారు సీపీ. తనే స్వయంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు మహేష్ భగవత్. పోలీస్ డ్రస్ వేశారు. చేతికి లాఠీ కూడా ఇచ్చారు.

పోలీస్ కమిషనర్ అయ్యావు కదా ఏం చేస్తావ్ అని అక్కడ ఉన్న మీడియా, పోలీసులు సరదాగా అడిగారు. ఈ ప్రశ్నకి ఇషాన్ చెప్పిన సమాధానంతో అందరూ షాక్ కూడా అయ్యారు. సిగరెట్లు కాల్చే వాళ్లను జైల్లో పెడతా..  పొగాకు నమిలే వాళ్లను జైల్లో పడేస్తా అంటూ తన ముద్దు ముద్దు మాటలతో చెప్పాడు. ఇంకా ఏం చేస్తావ్ అంటే.. అమ్మాయిలను వేధిస్తారు కదా.. ఈవ్ టీజర్లను కొడతా అంటూ చెప్పాడు. పోలీస్ కావాలనేదే నా కోరిక అన్నాడు. ఇప్పుడు ఒక్క రోజు సీపీగా తన కోరిక నెరవేర్చిన సీపీ మహష్ భగవత్ సార్ కి థాంక్స్ అన్నాడు చిన్నారి ఇషాన్.

Posted in Uncategorized

Latest Updates