సిగ్నల్ ప్రాబ్లమ్ లేదు : అంతరిక్షంలో ఫేస్ బుక్ శాటిలైట్


ఫేస్ బుక్.. సోషల్ మీడియాలో 90శాతం మంది కనెక్ట్ అయిన యాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్, ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కొత్త యూజర్లను పెంచుకుంటూనే.. సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. ఫేస్ బుక్ అనేది జీవితం భాగం అయ్యే విధంగా తన ప్రణాళికలు రచిస్తూనే. ఇందులో భాగంగా బ్రాండ్ బ్యాండ్ పై ఆధారపడుకుండా.. శాటిలైట్ ద్వారా నేరుగా ఫేస్ బుక్ కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తోంది. ఫేస్ బుక్ శాటిలైట్ పంపించాలని నిర్ణయించింది. దానికి ఎథేనా అనే పేరు పెట్టింది. ఇప్పటికే శాటిలైట్ తయారీ కూడా ప్రారంభించింది. మరో ఏడాది అంటే.. 2019 చివరి నాటికి ప్రయోగించాలని కూడా టార్గెట్ పెట్టుకుంది.

ఫేస్ బుక్ సొంత శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్ బాధ ఉండదు. ఎందుకంటే.. మారుమూల ప్రాంతాల్లోనూ ఫోన్ నుంచి నేరుగా శాటిలైట్ కు కనెక్ట్ అయ్యి.. హ్యాపీగా ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వొచ్చు. ఇందుకు కావాల్సిన అనుమతుల కోసం ఇప్పటికే అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ కు దరఖాస్తు కూడా చేసుకుంది. మరో మూడు, నాలుగు సంవత్సరాల్లో శాటిలైట్ టెక్నాలజీ అనేది ఎంతో ముఖ్యం అని.. అందులో భాగంగానే ఈ ప్రయోగం అని స్పష్టం చేసింది ఫేస్ బుక్..

Posted in Uncategorized

Latest Updates