సిటీని క్లీన్ గా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరిది : కేటీఆర్

MANA NAGARAMహైదరాబాద్ సిటీని క్లీన్ గా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరిదీ అన్నారు మంత్రి కేటీఆర్. తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరుచేయాలన్నారు. బుధవారం (జూన్-14) హైదరాబాద్ లోని L.B నగర్ లో జరిగిన మన నగరం అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. GHMC  కార్యక్రమాలపై బుక్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. సిటీని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు.

ప్రజలు సక్రమంగా ఆదాయపు పన్ను కట్టాలన్నారు. చెరువులు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపిన కేటీఆర్..పెరుగుతున్న జనాబాకు అనుకూలంగా సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. రోజుకు సిటీలో 5 వేల టన్నుల చెత్తను GHMC సేకరిస్తుందని తెలిపారు. చెత్త నుంచి ఎరువు, విద్యుత్ ను ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకన్నా LB నగర్ నియోజకవర్గంకు అధిక మొత్తంలో నిధులు కేటాయించడం పట్ల ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృష్ణయ్య కృతజ్ఞతులు తెలిపారు. అనంతరం మొక్కలు నాటిన మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates