సిటీలో చెడ్డీ గ్యాంగ్ ఉందా : సీసీ కెమెరాల్లో కనిపించిన దొంగలు

chaddi-gang

చెడ్డీ గ్యాంగ్ మరోసారి కలకలం రేపుతోంది. హైదరాబాద్ కూకట్ పల్లి నిజాంపేట్ ఏరియాలో తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అర్థరాత్రులు నిక్కర్లు వేసుకుని దొంగతనాలు చేస్తారు. వీరు ఎంతకైనా తెగించే రకం. అంతరాష్ట్ర దొంగల ముఠా ఇది. సిటీలో చెడ్డీ గ్యాంగ్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే నిజాంపేట బండారీ లేఔట్ రోడ్ నెంబర్ 5Cలోని శ్రీరాం నిలయం అపార్ట్ మెంట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ సంచలనం అయ్యాయి.

పార్కింగ్ ఏరియాలోకి వచ్చిన ఇద్దరు దొంగలు.. వాచ్ మెన్ గదికి గడియ పెట్టారు. ఆ తర్వాత చుట్టూ తిరిగారు. అర్థరాత్రి 3 గంటల సమయంలో తిరిగినట్లు రికార్డ్ అయ్యింది. ఒకడికి శరీరంపై నిక్కరు మాత్రమే ఉండగా.. మరొకడు బనీను, నిక్కరు వేసుకుని ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున వాచ్ మెన్ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపు రాలేదు. ఆందోళనకు గురైన వాచ్ మెన్.. అపార్ట్ మెంట్ వాసులకు ఫోన్ చేశాడు. వారు వచ్చి తలుపు తీశారు. తలుపు ఎవరు పెట్టి ఉంటారు అనే విషయం తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు చూడగా.. చెడ్డీ గ్యాంగ్ రూపంలోని ఇద్దరు దొంగలు విజువల్స్ కనిపించాయి. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటాం వెల్లడించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates