సిటీలో పెరుగుతున్న పేయింగ్ గెస్ట్ హౌజ్ లు

హైదరాబాద్ లో టాప్ ఇనిస్టిట్యూట్స్, కాలేజీలు పెరిగిపోతున్నాయి. ఏటా 20వేలకు పైగా విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని స్పెషల్ కోర్సుల కోసం అమీర్ పేట్, SR నగర్ కి వచ్చి ఉంటున్నారు. సిటీ శివార్లయిన  కొంపల్లి, పటాన్ చెరువు, గండిపేట్, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో చదువుకోవడానికి చాలామంది విద్యార్థులు వస్తున్నారు.

వివిధ అవసరాల కోసం సిటీకి వచ్చే వాళ్ళల్లో చాలామంది కాస్ట్ ఎక్కువైనా పేయింగ్ గెస్ట్ హోమ్స్ లో ఉండాలనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐటీ బూమ్ పెరుగుతుండటం, MNC కంపెనీలు ఆఫీసుల ఏర్పాటుతో జాబ్స్ చేసేవారు, ఐటీ ప్రొఫెషనల్స్ సంఖ్య పెరుగుతోంది. పేయింగ్ గెస్ట్ హౌజ్ ల్లో ఇంటి ఓనర్స్ తమతో ఉండేవాళ్ళని కుటుంబసభ్యులుగా భావిస్తుంటారు. ఇంటి వాతావరణంతో పాటు హోమ్లీ ఫుడ్,  సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండటంతో పేయింగ్ గెస్ట్ లుగా ఉండటానికి చాలామంది ఇష్టపడుతున్నారు.  ఇలాంటి వాళ్ళ నుంచి ఆధార్ కార్డు, ఐడీ ఫ్రూఫ్ తో పాటు, జాబ్ చేసే కంపెనీ నుంచి వర్కింగ్ లెటర్…. సెక్యూరిటీగా అడుగుతున్నారు ఓనర్స్. ఇక స్టూడెంట్స్ అయితే ఆధార్ కార్డుతో పాటు కాలేజీ ఐడెంటిటీ ని తీసుకుంటామంటున్నారు.

బెంగుళూరు తర్వాత పేయింగ్ గెస్ట్ కల్చర్ హైదరాబాద్ లోనే ఎక్కువ. ఇక్కడ 6 వేలకు పైగా పేయింగ్ గెస్ట్ హౌజ్ లున్నాయి.  పంజాగుట్ట, SR నగర్, అమీర్ పేట్ లాంటి ప్రాంతాల్లో ఇనిస్టిట్యూట్స్ ఎక్కువ. ఇలాంటి ప్లేసుల్లో నెలకు 5 వేల నుంచి ఎనిమిది వేల వరకు వసూలు చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, గౌలిదొడ్డి ఏరియాల్లో ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ.  ఇక్కడ 6 వేల నుంచి 15వేల వరకు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. సిటీలో ఎక్కడెక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ తో పేయింగ్ గెస్ట్ హౌజ్ లు అందుబాటులో ఉన్నాయో తెలపడానికి పీజీవో లాంటి కొన్ని యాప్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి.

Posted in Uncategorized

Latest Updates