సిటీలో భారీ సెక్యూరిటీ : రంజాన్ కోసం 8 వేల మంది పోలీసులు

RAMZANరంజాన్ మాసంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఎనిమిది వేల మంది పోలీసులుతో సెక్యూరిటీ పెంచారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రూమర్స్  ప్రచారం చేస్తే సీరియస్ యాక్షన్ తప్పదు అంటున్నారు పోలీసులు. రంజాన్ మాసం కోసం పోలీసులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసారు. పాతబస్తీతో పాటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రార్ధనలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సెక్యూరిటీ పెంచారు.

మతపెద్దలు, పీస్ కమిటీ సభ్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు పోలీసులు. రంజాన్ మాసం ముగిసేంత వరకు ప్రార్ధనా మందిరాల వద్ద పార్కింగ్,  ప్రార్థన సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా పాతబస్తీలోని అన్ని ప్రార్ధన మందిరాలతో పాటు సామూహిక ప్రార్ధనలు జరిగే మక్కామసీద్, మీరాలమ్ ఈద్గా,  సికింద్రాబాద్ లోని జామియా మసీద్  దగ్గర నిరంతర నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.

ఓల్డ్ సిటీలో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెటింగ్ పెట్టారు. బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ టీమ్ లతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ప్రార్ధనా మందిరాల పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకువచ్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల వీడియోలను గమనిస్తూ ప్రత్యేక సూచనలిచ్చే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎనిమిది వేల మంది పోలీసులను సెక్యూరిటీ కోసం సిద్దం చేసారు. లోకల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు,రాపిడ్ యాక్షన్ ఫోర్స్, మౌంటెడ్ పోలీసులు, ఆక్టోపస్ బలగాలను అందుబాటులో ఉంచారు. భద్రతపై భరోసా ఇస్తున్న పోలీసులు….పాతబస్తీలో యువత తమకు సహకరించాలని అంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చేరూమర్స్ ను నమ్మవద్దని,  అలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates