సిటీలో మొదలైన క్రిస్మస్ సందడి

హైదరాబాద్ : క్రిస్ట్ మస్ పండగ దగ్గర పడడంతో సిటీలో సందడి మొదలైంది. క్రిస్మస్ రోజు కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు జనం సిద్ధం అవుతున్నారు. పండగ సీజన్ కావడంతో కేక్ లకు మంచి గిరాకీ ఉంది. దీంతో వివిధ రకాల కేక్స్ తయారు చేసి…. కస్టమర్లను ఆకర్షిస్తున్నారు వ్యాపారులు.

నెల రోజుల ముందు నుంచే కేక్ మిక్సింగ్ ప్రోగ్రామ్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన క్రైస్తవ సోదరులు…క్రిస్ట్ మస్ ను మరింత గ్రాండ్ గా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. క్రిస్ట్ మస్ పండగలో కేక్స్ కు మంచి డిమాండ్ ఉండటంతో సిటీ లోని కేక్ షాప్స్, బేకరీస్ నిర్వాహకులు రకరకాల కేక్ లతో పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. కేక్ బుకింగ్స్ పెరగడంతో న్యూ థీమ్స్ తో నోరూరించే కేక్స్ తయారుచేస్తున్నారు. పిల్లలు, యూత్ కోసం ఫోటో థీమ్స్, ఫౌన్ టేయిన్ మోడల్స్, షాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీ మోడల్ కేక్స్ క్రిస్మస్ స్పెషల్ గా రెడీ చేస్తున్నారు. ఇక పెద్దవాళ్ల కోసం ఫుగర్ ఫ్రీ, ఎగ్ లెస్ కేక్స్ కూడా ఉన్నాయి. 100 గ్రాముల కేక్ నుంచి అందుబాటులో ఉన్నాయంటున్నారు వ్యాపారులు.

పిలల్లు ఎంతో ఇష్టం గ తినే ప్లం కేక్స్ కూడా డిఫరెంట్ షాప్స్ లో అందుబాటులో ఉన్నాయంటున్నారు. 250 రూపాయల మినిమమ్ ధర పలుకుతున్నాయి కేక్స్. క్రిస్మస్ కి 10 రోజుల ముందు నుంచే బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. చాకోలేట్, వెనీలా ఫ్లేవర్స్  తో పాటు స్ట్రాబెర్రీ, చెర్రీస్ , కూల్  కేక్ లు ఎక్కువగా బుకింగ్స్ అవుతున్నాయని చెబుతున్నారు వ్యాపారులు. క్రిస్ట్ మస్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు సిద్ధమైన సిటీ జనం..కేక్ ల కొనుగోళ్లలో వెనక్కి తగ్గడం లేదు. పండగ కోసం ప్రత్యేకంగా డిఫరెంట్ కేక్స్ తయారు చేయడంతో బేకరీలు, కేక్ మేకింగ్ షాప్స్ కు క్యూ పెరిగింది. డిసెంబర్ 24 తేదీన కేక్ డెలివరీస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది ఆన్ లైన్ బుకింగ్ లు కూడా పెరిగాయంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates