సిటీలో వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం

హైదరాబాద్ : స్నేహితులను కలవడానికి వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఎస్సై మహేశ్వరం మండలం, మంఖాల్ గ్రామానికి చెందిన మర్రిపల్లి అంజయ్య(78) ఈ నెల 9న స్నేహితులను కలవడానికి ఉప్పుగూడ, శివాజీనగర్‌కు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెదికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతని కుమారుడు మహేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్యూబా కాలనీలో బాలిక..

ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. ఈ సంఘటన బాలాపూర్ లో చోటు చేసుకుంది. బాలాపూర్ మండలం…క్యూబా కాలనీలో నివాసముంటున్న దస్తగిరి కూతురు మెహిక్(6) ఈ నెల 10న సాయంత్రం ఆడుకుంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యు లు పరిసర ప్రాంతాల్లో వెదికినా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates