సిటీలో స్వచ్ఛ ఆటోలు ప్రారంభం : GHMC కమిషనర్

GHMCసచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా సిటీలో కొత్తగా 150 స్వచ్ఛ ఆటోలు ప్రారంభించామన్నారు GHMC కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇప్పటికే నగరంలో రెండు వేల ఆటోలు చెత్త సేకరిస్తున్నాయన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మేయర్ బొంతు రామ్మోహన్.

నగర సుందరీకరణలో స్వచ్ఛ ఆటోలు ప్రాధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. వీటికి జీపీఎస్ సిస్టమ్ పెట్టడంతో ఎన్ని ట్రిప్పులు తిరిగేది రికార్డు అవుందదన్నారు. పీపుల్స్ ప్లాజాలో స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు సీఎస్ SK జోషి. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates