సిటీలో 40 బస్తీ హస్పిటల్స్ : మంత్రి లక్ష్మారెడ్డి

laxmareddy2503హైదరాబాద్ లో 40 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి. ఆదివారం (మార్చి-25) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బస్తీ దవాఖానాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ నుంచి 15 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వస్తాయన్నారు. బస్తీ దవాఖానాలను పర్‌ఫెక్ట్‌గా నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాల్లోని బస్తీల్లో బస్తీ దవాఖానాలను దశల వారీగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates