సిటీ చెరువుల అభివృద్ధికి రూ.441 కోట్లు : కేటీఆర్

KTRSఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న 40 చెరువులను GHMC ద్వారా రూ.441 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం సిటీలో పర్యటించిన కేటీఆర్.. నెక్నాంపూర్ చెరువు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం లో 46వేల చెరువులను మిషన్ మోడ్ లో అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. చెరువుల అభివృద్దిలో స్టానికుల సహకారం అవసరమన్నారు.

ప్రతి చెరువు పూర్తిస్టాయి నీటి మట్టంలో నిర్మాణాలను నివారిస్తామన్న కేటీఆర్.. చెరువుల అభివృద్ది పర్యవేక్షణకు యువ IAS అధికారి నేతృత్వం వహించనున్నాడని చెప్పారు.  చెరువుల్లో మురుగు నీరు కలువకుండా సీవరెజి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్.. గండిపేట అభివృద్దికి రూ.100 కోట్లను కెటాయించామన్నారు. 100 ఫ్లాట్లు వున్న అన్ని అపార్టుమెంట్లలో తప్పనిసరిగా ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని..ఇది బిల్డర్ల భాద్యతని నిర్దేశించారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates