సిటీ మొత్తం ఏర్పాటు చేయండి : ఏసీ బస్ షెల్టర్లకి రెస్పాన్స్ అదుర్స్

సిటీలో ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్లకు ఆదరణ పెరిగింది. ఎండా, వాన నుంచి రిలీఫ్ ఉండటంతో రద్దీ పెరిగింది. ఏసీ టాయిలెట్స్, రిజర్వేషన్ కౌంటర్ తో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. సిటీలో మరిన్ని ఏసీ బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం.

సిటీలో బల్దియా ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఖైరతాబాద్, కూకట్ పల్లి ప్రాంతాల్లో 10 ఏసీ బస్ షెల్టర్లతోపాటు ఏసీ టాయిలెట్స్, రిజర్వేషన్ కౌంటర్, ఏటీఎం సెంటర్, వైఫై సౌకర్యం కూడా కల్పించడంతో జనానికి ఉపయోగకరంగా  మారింది.

సిటీలో ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్లు బాగున్నాయంటున్నారు జనం. గతంలో సరైన బస్టాప్ లేక ఎండకు, వానకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. అయితే ఏసీ బస్ స్టాపుల్లో బస్సులు ఎక్కువ సేపు ఆగడం లేదంటున్నారు. గతంలో బస్టాప్ లేనప్పుడు వర్షం పడితే బుక్స్ తడిసిపోయేవనీ..ఏసీ బస్టాప్ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు విద్యార్థులు. మరోవైపు ఏసీ బస్ షెల్టర్స్ లో రష్ బాగా పెరిగిందంటున్నారు సెక్యూరిటీ గార్డులు. ఉదయం సాయంత్రం టైంలో రద్దీ ఎక్కువగా ఉంటోందంటున్నారు. సిటీ మొత్తం ఏసీ బస్ షెల్టర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు జనం. ప్రస్తుతం ఉన్న బస్ షెల్టర్స్ స్థానంలో ఏసీవి పెట్టాలని కోరుతున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates