సిట్టిగాడి గుండెకాయని గోలెట్టించేసిందిరా ఈ పిల్ల

rangaఇప్పటేకే విడుదలైన రామ్ చరణ్ రంగస్ధలం లుక్స్  చెర్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆశక్తిని పెంచేస్తుంది. ఇటీవల విడుదలైన రంగస్ధలం టీజర్ లో చిట్టిబాబుగా పల్లెటూరి గెటప్ లో కన్పించిన రామ్ చరణ్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ టీజర్ లో ఎక్కడా హీరోయిన్ సమంత మాత్రం కన్పించలేదు. దీంతో సమంతను డైరక్టర్ సుకుమార్ ఎలా చూపించబోతున్నారంటూ అభిమానులు సమంత లుక్ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని రోజుల నుండి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూసిన రామలక్ష్మి(సమంత) టీజర్ ను ఈ రోజు సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఓహో ఏం వయ్యారం.. ఏం వయ్యారం.. ఏమాటకామాటే సెప్పుకోవాలి గానీ అండీ.. ఈ పిల్లెదురొత్తుంటే మా ఊరికే 18సంవత్సరాల వయసొచ్చినట్టుగా ఉంటుందండీ  అంటున్న రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌తో సమంత సైకిల్‌పై వస్తున్న సీన్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్ కు అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తుంది.ఈ సిట్టిగాడి గుండెకాయని గోలెట్టించేసింది ఈ పిల్లేనండి.. పేరు రామలక్ష్మండి.. అంటూ రామలక్ష్మిని చిట్టిబాబు వర్ణిస్తున్న సీన్ లో పక్కా పల్లెటూరి అమ్మాయిలా సమంత  అదరగొట్టేసింది.

Posted in Uncategorized

Latest Updates