సిట్టిబాబు రంగమ్మత్తకి గారాలబాబు: అనసూయ

anasuya
ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. మార్చి 27, 1985లో జన్మించిన రామ్ చరణ్ నేటితో 33వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షల హోరు నడుస్తోంది. సెలబ్రిటీలు, అభిమానులు రామ్ చరణ్‌కు బర్త్‌డే విశెష్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. రంగస్థలం చిత్రంలో కీలకపాత్రలో నటించిన అనసూయ.. నా గారాలబాబు అంటూ చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.

‘నా అభిమాన సహ నటుడు , నేను అమితంగా అభిమానించే రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరమంతా బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. సిట్టిబాబు రంగమ్మత్తకి గారాలబాబు’’ అంటూ అనసూయ తన ట్విట్టర్ పేజీలో రంగస్థలం వర్కింగ్ స్టిల్స్‌ని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates