సిడ్నీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఆస్ర్టేలియా లోని సిడ్నీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సిడ్నీ బతుకమ్మ , దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (ఎస్బీడీఎఫ్), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ఏటీఎఫ్)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.  బతుకమ్మ సంబురాల్లో 1700 నుంచి 2000 మంది వరకు పాల్గొన్నారు. ప్రవాస తెలంగాణవాసులే కాకుండా.. పంజాబీలు, చైనీయులు, తమిళులతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన వారు పాల్గొని బతుకమ్మ వేడుకలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సాంప్రదాయ వేషధారణకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.

Posted in Uncategorized

Latest Updates