సిద్దరామయ్య,ఆజాద్: తాజ్‌ కృష్ణలో సీఎల్పీ సమావేశం

AAకర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ నేత అజాద్ లు హైదరాబాద్ చేరుకున్నారు. బెంగళూరులోని ఎయిర్‌ పోర్టు నుంచి విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ నుంచి నేరుగా హోటల్ తాజ్ కృష్ణకు వచ్చారు. తాజ్‌ కృష్ణలో సిద్దరామయ్య ఆధ్వర్యంలో కర్ణాటక సీఎల్పీ సమావేశం నిర్వహించారు. రేపు(శనివారం,మే-19) అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సిద్దరామయ్య, అజాద్. అటు నోవాటెల్ లో ఉన్న జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా తాజ్ కృష్ణకు వస్తారని సమాచారం.

సీఎల్పీ మీటింగ్ అయిపోయాక.. రెండు పార్టీల ఎమ్మెల్యేలు కలిసి మీటింగ్ పెట్టుకోనున్నారు. అంతా అయ్యాక రాత్రి ఏడుగంటల తర్వాత రోడ్డుమార్గంలోనే కర్ణాటక వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates