సిద్దిపేటకు సౌత్ ఇండియాలోనే బెస్ట్ క్లీన్ సిటీగా అవార్డు

SIDDIసిద్దిపేటకు అవార్డుల జాతర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న స్వచ్ఛ ఎక్స్ లెన్స్ అవార్డును అందుకున్న పట్టణం…బుధవారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ లో సౌతిండియాలోనే బెస్ట్ క్లీన్ సిటీ అవార్డుకు ఎంపికై ఆదర్శంగా నిలిచింది. ఈ అవార్డు కోసం దేశంలోని 4 వేల 41 మున్సిపాలిటీలు పోటీపడగా…సిద్దిపేట మున్సిపాలిటీని అవార్డు వరించింది. పారిశుద్యం, తడి, పొడి చెత్త సేకరణ, చెత్తతో కంపోస్ట్ ఎరువుల తయారీ, తదితర 42 అంశాలలో సిద్దిపేట మున్సిపాలిటీకి 1400 మార్కులు వచ్చాయి. పట్టణానికి అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానిక నేతలు, అధికారులు. మరిన్ని అవార్డులు సాధించేందుకు కృషిచేస్తామంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates