సిద్దిపేటలో ఘనంగా తీజ్ ఉత్సవాలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్  మండలం జిల్లెలగడ్డ  గ్రామంలో  లంబాడీల  బతుకమ్మ పండుగ.. తీజ్ ఉత్సవాలు  ప్రారంభమైయ్యాయి. గిరిజన  సంప్రదాయంగా  చేసే  తీజ్ వేడుకలను  తండా పెద్ద ఇంటి దగ్గర పందిరి  వేసి …వెదురు బుట్టల్లో  గోధుమనారు  అల్లి  ప్రారంభిస్తారు.  పెళ్లికానీ  కన్నెపిల్లలు …తొమ్మిదిరోజుల పాటు  నిష్టతో   గోధుమనారుకు  నీరు పోస్తారు. అక్కడే  ప్రతిష్టించిన  డోక్రా- డోక్రీ  విగ్రహాలకు  ప్రత్యేక పూజలు చేస్తారు. ఏపుగా  పెరిగిన  గోధుమనారును  వెదురు బుట్టల్లో  ఎత్తుకుని  గిరిజన సంప్రదాయల  ప్రకారం… ఊరేగింపుగా  వెళ్లి  చెరువులో  నిమజ్జనం చేస్తారు.  ఈ పండుగ  జరుపుకోవటం ద్వారా …అమ్మాయిలకు మంచి భర్తలు  దొరుకుతారని  లంబాడీలు విశ్వాసం . నిమజ్జనంతో  తీజ్ ఉత్సవాలు  ముగుస్తాయి.

Posted in Uncategorized

Latest Updates