సిద్దిపేట: బేటీ బచావో- బేటీ పడావో విగ్రహాల ఆవిష్కరణ

betiబాలికల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకం బేటీ బచావో- బేటీ పడావో (BBBP). ఆడపిల్లల పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు కూడా చేపట్టింది.  అధికారులు  బేటీ బచావో- బేటీ పడావో పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేటీ బచావో-బేటీ పడావో విగ్రహాలను సోమవారం(జులై-2) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజా సంబంధాల కమిషనలర్ పరికిబండ్ల నరహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్వాలియర్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన టైంలో “హమారీ లాగీ” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అప్పుడు స్త్రీ,పురుష నిష్పత్తి 850: 1000 గా ఉండగా…రెండేళ్లలో స్త్రీల సంఖ్య 900కు చేరిందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఆడపిల్లల వివక్షపై సమాజంలో పరివర్తనకు కృషి చేస్తామన్నారు నరహరి. ఆడపిల్లలను రక్షించాలి.. ఆడ బిడ్డలను చదివించాలని ఏర్పాటు చేసిన విగ్రహం పలువురిని ఆకట్టుకుంటోంది.

Posted in Uncategorized

Latest Updates