సిద్దిపేట మెడికల్ కాలేజీకి ఎంసీఐ అనుమతి

MCIతెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(MCI) అనుమతిచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 150 సీట్లతో 2018-19 ఏడాదికి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభం కానుంది. సిద్దిపేట మెడికల్ కాలేజీకి MCI అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. దేశంలో 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సిద్దిపేట మెడికల్ కాలేజీ ఒకటన్నారు.

Posted in Uncategorized

Latest Updates