సిద్దూకి కీలక పదవి అప్పగించనున్నకుమారస్వామి

hdkమాజీ  ముఖ్యమంత్రి  సిద్ధరామయ్యకు.. .కేబినెట్  హోదాతో  ఓ పదవిని  కట్టబెట్టేందుకు ప్లాన్ రెడీ  చేస్తోంది  కర్నాటక  సంకీర్ణ ప్రభుత్వం.  ప్రస్తుతం  సిద్ధరామయ్య  సంకీర్ణ  ప్రభుత్వ  సమన్వయ సమితి  అధ్యక్షుడుగా  ఉన్నారు. ఈ పదవిలో  ఈయన  సేవలన్నీ ప్రభుత్వానికి  బయట నుంచే  చేయాలి. ఈ పదవికి  అధికారికంగా  ప్రత్యేక హోదా  ఉండదు. అయిదేళ్ల పాటు  ఏకధాటిగా  కాంగ్రెస్  ప్రభుత్వాన్ని  నడిపిన సిద్ధరామయ్యకు..  మరింత  ఉన్నతమైన  స్థానాన్ని  కట్టబెట్టేందుకు  సంకీర్ణ  ప్రభుత్వం పావులు  కదుపుతోంది. ప్రభుత్వమే సమన్వయ సమితిని  ఏర్పాటు చేసి…దానికి కేబినెట్  హోదాను  ఇవ్వనున్నట్టు  సమాచారం. దీనిపై  ముఖ్యమంత్రి  కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి  పరమేశ్వర …సుదీర్ఘంగా  చర్చిస్తున్నట్లు  తెలుస్తోంది.

సమన్వయ  సమితిని  ప్రభుత్వమే  ఏర్పాటు చేసి.. దానికి  సిద్ధరామయ్యనే  అధ్యక్షుడ్ని చేస్తారు.  కేంద్రంలో యూపీఏ  అధికారంలో  ఉన్నపుడు  ప్రభుత్వాన్ని సమన్వయ  పరిచేందుకు  సోనియాగాంధీని  అధ్యక్షులుగా చేశారు. ఈపదవిలో  సోనియా  అత్యంత  కీలకపాత్ర  పోషించారు.  ఇదే తరహాలో  ప్రస్తుత కర్ణాటక  సంకీర్ణ  ప్రభుత్వానికి  సమన్వయ సమితి  అధ్యక్షులుగా  సిద్ధరామయ్య  క్రియాశీలకంగా  వ్యవహరిస్తారు.  విధాన సౌధలోనూ… ఈ సమితి  వ్యవహారాల కోసం  ప్రత్యేక  కార్యాలయాన్ని ఏర్పాటు  చేస్తారు. కేబినెట్  హోదాలోనే  సమన్వయ సమితి  అధ్యక్షుడు  ప్రభుత్వానికి  సలహాలు ఇస్తారని  చెప్తున్నారు.  ఇవాళ  సాయంత్రంలోపు  ప్రకటన  వచ్చే అవకాశాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates