సిద్దూ సెటైర్స్ : ప్రజలను క్యూలైన్లలో.. నీరవ్ మోడీని విమానంలో

CMSiddaramaiahప్రధానమంత్రిగా కొనసాగే అర్హత నరేంద్రమోడీకి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కర్నాటక సీఎం సిద్దరామయ్య. నోట్ల రద్దుతో ప్రజలను క్యూలైన్లో నిలబెట్టారని.. వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న నీరవ్ మోడీని విమానం ఎక్కి పంపించావు అంటూ సిద్దూ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రిలా మోడీ మాట్లాడటం లేదని విరుచుకుపడ్డారు. కర్ణాటకలో, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, అవేవి తనకు పట్టనట్లు మోడీ వ్యవహరిస్తున్నారని బీజేపీపై ఎదురుదాడి చేశారు. బాధ్యాతయుతమైన ప్రకటనలు చేయాలని, రాజకీయపరమైన వ్యాఖ్యలు సరికాదని మోడీకి సూచించారు సిద్ధరామయ్య.

నోట్లు రద్దు చేసి బ్యాంకుల దగ్గర సామాన్యులను క్యూలైన్లలో నిలబెట్టించావు.. ఇప్పుడేమో నీరవ్ మోడీని రూ.12 వేల కోట్ల ప్రజాధనంతో విదేశాలకు పంపించావు అంటూ సెటైర్లు వేశారు. ఈ రూ.12 వేల కోట్లలో ప్రజల డబ్బు ఎంత ఉంది అని మోడీని ప్రశ్నించారు సిద్దరామయ్య.

Posted in Uncategorized

Latest Updates