సినారె స్మృతివనం వద్ద ప్రముఖుల నివాళి

CNAREVARTHANTHI-AVజ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహాకవి దివంగత డా.సి.నారాయణరెడ్డి ప్రథమ వర్థంతిని స్వగ్రామంలో నిర్వహించారు. మంగళవారం (జూన్-12) రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మజిపేటలో ఆయన కుటుంబ సభ్యులు స్మృతివనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సినారె నివాస ఆవరణలో ఏర్పాటుచేసిన వర్థంతి కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని నివాళి అర్పించారు.

సినారె ముని మనవరాలు వరేణ్యరెడ్డి రచించిన ఇతిహాస పాత్రలు మరోకోణం నుంచి అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్పవ్యక్తి సినారె అంటూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు ప్రముఖులు. ఈ కార్యక్రమలో పాఠశాల విద్యార్థులు సహా కవులు, రచయితలు, మేధావులు, స్థానికులు పాల్గొన్నారు

Posted in Uncategorized

Latest Updates