సినిమాగా వస్తున్న భారతీయుడి కథ : ప్రేమ కోసం సైకిల్ పైనే ఖండాలు దాటాడు

సినిమాగా వస్తున్న భారతీయుడి కథ ప్రేమ కోసం సైకిల్ పైనే ఖండాలు దాటాడుప్రేమ…. దీనికి సరిహద్దులు ఉండవు. కులాలు, మతాలు, ప్రాంతాల భేధం ఉండదు. రెండు మనసులు కలిసేదే ప్రేమ. ఆ రెండు మనసులు ఒక్కటైనప్పుడు ఏ శక్తి దాన్ని విడదీయలేదు. ఎన్ని సముద్రాలనైనా ఎదురీదగల శక్తినిస్తుంది ప్రేమ. తాము ప్రేమించిన వారి కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోని తమ ప్రేమను దక్కించుకుంటారు ప్రేమికులు. తన ప్రేమకోసం సరిహద్దులు దాటి దేశం కాని చేరుకొన్నాడు ఓ ప్రేమికుడు. అదికూడా ఓ సైకిల్ పై 4వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎంతగానో ప్రేమించిన తన ప్రియురాలి దగ్గరికి చేరుకొని ఆమె ప్రేమను పొందాడు. నిజమైన ప్రేమను పొందిన ఆ ప్రేమికుడే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన PK.మహానందియా.

1949 లో ఒరిస్సా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలోని అత్ మాలిక్ తాలుకాలోని కందపాడ గ్రామంలో ఓ దళిత కుటుంబంలో మహాందియా జన్మించాడు. అత్ మాలిక్ లోని మహేంద్ర హైస్కూల్ లో  హైస్కూల్ విద్యను పూర్తి చేశాడు. ఆ తరువాత కలికోటెలోని గవర్కమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో ఆర్ట్ లో జాయిన్ అయ్యాడు. ఆ తరువాత ఫైన్ ఆర్ట్స్ చదవాలన్న తపనతో 1971లో కాలేజీ ఆఫ్ ఆర్ట్ ఢిల్లీలో జాయిన్ అయ్యాడు.

దళితుడన్న కారణంగా స్కూల్ విద్యాభ్యాస సమయంలో వివక్షకు గురయ్యాడు మహానందియా. అనేకసార్లు తన తల్లితో తాను వివక్షకు గురవుతున్నానని చెప్పుకొని ఏడ్చేవాడు. మహానందియా భాధపడుతున్న సమయంలో అతడి తల్లి… నీ జాతకం ప్రకారం వృషభరాశి జాతకం గల అమ్మాయి చాలా దారం నీ కోసం వస్తుందని, ఆమెకు సొంత ఫారెస్ట్ ఉంటుందని, ఆమె మంచి సంగీత ప్రియురాలని ఆమెతోనే నీ పెళ్లి జరుగుతుందని చెప్పేది.

మహానందియా తల్లి చెప్పినట్లుగానే… ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో మహానందియా స్కెచ్ ఆర్టిస్టుగా ఉన్న సమయంలో లండన్ కాలేజీలో స్టూడెంట్ గా ఉన్న చార్లెట్ ఓన్ స్కెడ్ విన్ అనే స్వీడన్ కు చెందిన యువతి టూరిస్టుగా ఢిల్లీ వచ్చింది. అప్పటికే  కనాట్ ఏరియాలో మంచి స్కెచ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న మహానందియాతో తన చిత్రం గీయించుకోవడానికి డిసెంబర్-17, 1975 లో మొదటిసారిగా మహానందియాను కలుసుకుంది స్కెడ్ విన్. ఫస్ట్ టైం మహానందియా గీసిన చిత్రం ఆమెను ఇంప్రెస్ చెయ్యలేదు. దీంతో మళ్లీ తరువాతి రోజు రావాలని నిర్ణయించుకుంది. అయితే ఆ తరువాతి రోజు కూడా అతడు గీసిన చిత్రం సరిగ్గా రాలేదు.

స్కెడ్ విన్ ను చూడగానే ప్రేమలో పడిన మహానందియా తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి… స్కెడ్ విన్ ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని తన తల్లి చెప్పింది నిజమేనని మురిసిపోయాడు. ఆమెన టీ తాగడానికి ఆహ్వానించాడు. అయితే ఆమె ఎక్కడ పోలీసులకు కంప్లెయింట్ చేస్తుందోనని తెగ భయపడ్డాడు. అయితే అలాంటిదేమీ జరగలేదు. అలా వీరి మధ్య కొంతసమయం మాటలు గడిచాక మహానందియా నిజాయితీ నచ్చిన ఆమె అతడితో కలసి ఒరిస్సా వెళ్లేందుకు అంగీకరించింది. అలా వారిద్దరూ ఒరిస్సా వెళ్లి ప్రముఖ కోణార్క్ టెంపుల్ ను దర్శించుకున్నారు.

ఆ తరువాత మహానందియా స్వగ్రామంలో కొన్ని రోజులు గడిపిన తర్వాత వీరిద్దరూ ఢిల్లీకి వచ్చారు. ఆ సమయంలోనే వారి మనసులు దగ్గరయ్యాయి. టూర్ ముగియడంతో తిరుగుప్రయాణానికి సిద్దమైన ఆమెతో తప్పకుండా మళ్లీ వచ్చి కలుసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఆ తరువాత సంవత్సరం పైగా వీరిద్దరి మధ్య ప్రేమ ఉత్తరాలు నడిచాయి. స్వీడన్ లోని స్కెడ్ విన్ ను కలిసేందుకు జనవరి-22,1977 లో సెకండ్ హ్యాండ్ సైకిల్ పై యూరప్ యాత్ర చేపట్టి రోజుకు 70 కిలోమీటర్లు తొక్కుతూ… 4నెలల మూడు వారాల పాటు ప్రయాణించి మే-28న స్వీడన్ లోని గూటన్ బర్గ్ సిటీ చేరుకొని తన ప్రియురాలని కలసుకొన్నాడు. ఆ తరువాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అంతేకాకుండా తన పెయింటింగ్ తో స్వీడన్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. ప్రపంచంలోని ప్రముఖ సిటీలలో మహానందియా ఫోటోలు ప్రధర్శించబడ్డాయి. అంతేకాకుండా ప్రస్టేజియస్ UNICEF గ్రీటింగ్ కార్డులలో కూడా ఇతని పెయింటింగ్ లు స్ధానం పొందాయి. 2012లో భువనేశ్వర్ లోని ఉత్కల్ యూనివర్శిటీ ఆఫ్ కల్చర్ గౌరవ డాక్టరేట్ డిగ్రీతో సత్కరించింది.2010లో ప్రముఖ బీలీవుడ్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ వీరి ప్రేయకధను సినిమాగా తీయాలని భావించారు.  ప్రస్తుతం వీరి ప్రేమ కధ సినిమాగా తెరకెక్కుతుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా  వీరి ప్రేమ కధ సినిమా రూపంలో విడుదలవనుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates