సినిమాను తలదన్నే యాక్షన్ సీన్ : కిడ్నాపర్ల నుంచి బాలుడిని రక్షించిన పోలీసులు

kidnapనెల క్రితం తూర్పు ఢిల్లీలో స్కూల్ వ్యాన్ నుంచి కిడ్నాప్ అయిన ఐదేళ్ల చిన్నారిని.. రెస్కూ ఆపరేషన్ చేసి కాపాడారు పోలీసులు. ఈ ఆపరేషన్ ఓ సినిమా ఛేజింగ్ ను తలపించింది. సినిమాల్లో చూసినట్లు హీరో కొడుకుని విలన్ ఎత్తుకెళితే పోలీసులు వారిని వెంబడిస్తారు. విలన్ – పోలీసుల మధ్య కాల్పులు. చివరకు బాబుని కాపాడతారు. సేమ్ టూ సేమ్ ఇలానే ఢిల్లీ పోలీసులు తమ ధైర్య సాహసాలను ప్రదర్శించి కిడ్నాప్ అయిన చిన్నారిని మంగళవారం(ఫిబ్రవరి 6) ఘజియాబాద్ లో పోలీసులు కాపాడారు. ఓ లాడ్జిలో ఉన్న వీరిపై దాడి చేయటానికి ప్రత్యేక పోలీస్ బృందం రెడీ అయ్యింది. విషయం తెలిసి కాల్పులు జరిపారు కిడ్నాపర్స్.

పోలీసులు – కిడ్నాపర్స్  మధ్య కాల్పుల్లో కిడ్నాపర్స్ పంకజ్, రవి గాయపడ్డారు. గామపడిన వీరిని GTB హాస్పిటల్ కు తరలించారు. మరో కిడ్నాపర్ నితిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ ఉండటంతో సేవ్ అయ్యాడని పోలీస్ అధికారులు తెలిపారు. కిడ్నాపర్ అయిన చిన్నారిని సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.

జనవరి 25 న  చిన్నారి తన అక్కతో ఉదయం 7:30 కు స్కూల్ కు వెళ్తున్నప్పుడు ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు.. స్కూల్ వ్యాన్ లోకి చొరబడి వ్యాన్ డ్రైవర్ పై కాల్పులు జరిపి.. చిన్నారిని ఎత్తుకెళ్లారు. చిన్నారి కుటుంబం నుంచి రూ.70 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు ఈ కిడ్నాపర్స్ ఉన్న ప్రదేశాన్ని పోలీసులు ట్రాప్ చేసి రెస్క్యూ ఆపరేషన్ చేసి సురక్షితంగా కాపాడారు.

Posted in Uncategorized

Latest Updates