సినిమాను తలపించే ట్విస్ట్ : సెల్ఫీ ఆపిన పెళ్లి

selఓ సెల్ఫీ కారణంగా… పీటలపై పెళ్లి నిలిచిపోయింది. సినిమా సీన్ ను తలపించే ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగింది. పెళ్లి పందిరి నుంచి సీన్ పోలీస్ స్టేషన్ కు చేరింది.

వరంగల్ జిల్లా సూరారం గ్రామానికి చెందిన యువతికి మంచిర్యాల జిల్లాలోని రామక్రిష్ణాపురంకి చెందిన అనీల్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు.  కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లోని బీఎస్ ఆర్ గార్డెన్స్ లో సోమవారం ఉదయం జరగాల్సిన వివాహ కార్యక్రమానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెళ్లికి అందరూ వచ్చారు. మరికాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాలిన సమయంలో గుంటూరుకు చెందిన ప్రశాంత్ అనే ఓ యువకుడు పెళ్లి కొడుకు అనీల్ కుమార్ ఫోన్ కు వాట్సాప్ ద్వారా కొన్ని ఫోటోలను పంపించాడు. వధువును పెళ్లి చేసుకోవద్దని, వధువు, ఆ యువకుడు గతంలో కలసి తీసుకున్న సెల్ఫీలను పంపించాడు. ఆ యువతితో కలిసి తీసుకున్న ఫోటోను ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేశాడు. దీంతో వధువు మెడలో తాళి కట్టాల్సిన అనీల్ పీటలపై నుంచి లేచి వెళ్లిపోయాడు. అంతేకాకుండా తనను ప్రేమించి మోసం చేసిందంటూ యువతిపై పోలీసులకు కంఫ్లెయింట్ చేశాడు ప్రశాంత్. భాధిత యువతి  హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్లో పని చేస్తుంది. అదే సూపర్ మార్కెట్లో క్యాషియర్ గా పని చేస్తున్న గుంటూరుకి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. ఓ సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు ఆ యువతి పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది. పెళ్లి ఆగిపోయేలా చేసిన ప్రశాంత్ పై పోలీసులకు కంప్లెయింట్ చేశారు యువతి బంధువులు.

Posted in Uncategorized

Latest Updates