సినిమా టికెట్స్ పై తగ్గిన GST

హైద‌రాబాద్: GST తీసుకున్న నిర్ణయం సినిమాకు కలిసివచ్చింది. శనివారం 33 వస్తువులపై GSTని తగ్గిస్తూ మండలి నిర్ణయం తీసుకోగా..అందులో సినిమా టికెట్స్ కూడా ఉంది. రూ 100 లోపు ఉన్న సినిమా టికెట్ ధ‌ర‌పై GSTని 18 శాతం నుంచి 12 శాతానికి త‌గ్గించారు. రూ.100 పైన ఉన్న టికెట్ ధ‌ర‌పై GSTని 28 నుంచి 18 శాతానికి త‌గ్గించారు. సినిమా టెకెట్ రేట్స్ పై GSTని తగ్గించడంతో హర్షం వ్యక్తం చేశాయి ఫిల్మ్ వ‌ర్గాలు.

GST త‌గ్గ‌డంవ‌ల్ల ఇండ‌స్ట్రీలో పెట్టుబ‌డులు పెరుగుతాయ‌ని అభిప్రాయ‌ప‌డింది గిల్డ్.  ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సహకరిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వానికి స‌హ‌కరిస్తూనే ఉంటామ‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సిద్ధార్ధ రాయ్ కపూర్ లేఖ‌లో తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం హ‌ర్ష‌ణీయ‌మ‌ని, ప్రధాని మోడీకి థ్యాంక్స్ అంటూ బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates