సినిమా సీన్ కాదు : కెమెరాలో యువతి ఆత్మహత్య రికార్డ్

suscideసినిమాల్లో బిల్డింగ్ పై నుంచి దూకటం, కొండ పైనుంచి నదిలో దూకటం, చెరువుల్లో దూకటం చూసి ఉంటాం.. హైదరాబాద్ లో అలాంటి రియల్ సీన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో దగ్గరలోని కొందరు యువకులు ఈ సీన్ మొత్తాన్ని సెల్ ఫోన్ లో బంధించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

హైదరాబాద్ సిటీ కూకట్ పల్లి సమీపంలోని గాజుల రామారం ప్రాంతంలో క్వారీ గుంతలు ఉన్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 30 ఏళ్ల మహిళ ఆ ప్రాంతానికి వచ్చింది. అటూ ఇటూ తిరుగుతుంది. కొద్ది సేపటికి క్వారీ గుంతల్లోకి దిగుతుంది. ఈ విషయాన్ని గమనించిన సమీపంలోని కొందరు వ్యక్తులు ఆ యువతికి కేకలు వేశారు. దిగొద్దు.. దిగ్గొద్దూ అని వారించారు. పడిపోతావ్.. వద్దు అంటూ కేకలు వేస్తూ అటు వైపు పరిగెత్తారు. వారిలో ఓ వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు.

ఆ యువతి క్వారీ గుంతలోకి దిగటం.. చివర్లో దూకటం కనిపిస్తోంది. నీళ్లలో పడిన తర్వాత గిలగిలా కొట్టుకోవటం కూడా ఉంది. ఇదంతా స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆ యువతిని కాపాడేందుకు కొందరు క్వారీలోకి దిగారు. యువతిని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ యువతి చనిపోయింది. ఈమె వయస్సు 30 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. పెళ్లయ్యింది. ఒంటిపై బంగారు నగలు కూడా ఉన్నాయి. చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయి. ఈమె ఆచూకీ కోసం విచారణ చేస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates