సినీ ఇండస్ట్రీపై వన్ సైడ్ విమర్శలు సరికాదు : తమ్మారెడ్డి

Tammareddy-Bharadwajaతెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై నిరసనలు… విమర్శలపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ స్పందించిన తీరుపై నటులు తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపైనా తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

టాలీవుడ్ పరిశ్రమ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని విజయవాడలో చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇండస్ట్రీ చెడిపోతే అందులోని అమ్మాయిలను తాము ఎందుకు పెళ్లి చేసుకుంటామని అన్నారు. టీవీ ఛానెళ్లు , సినిమా కలిసి పనిచేయాల్సిన మాధ్యమాలని చెప్పిన ఆయన…. ఇండస్ట్రీపై వన్ సైడెడ్ గా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కనీసం ఇండస్ట్రీకి కంప్లయింట్ చేయకుండా.. పబ్లిసిటీ కోసం ప్రయత్నించేవారి వ్యాఖ్యలకు టీవీ ఛానెళ్లు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు భరద్వాజ.

Posted in Uncategorized

Latest Updates