సినీ ఇండస్ట్రీ డిమాండ్ : నారాయణమూర్తి రాజకీయాల్లోకి వెళ్లాలి

r-narayana-murthyఆర్.నారాయణమూర్తి ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీని వదిలేసి.. రాజకీయాల్లోకి వెళ్లాలని కోరారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. రాజకీయాల ద్వారానే ఆయన అనుకున్నది సాధించవచ్చని ఆకాంక్షించారు. ఎవరెవరో వస్తున్నారని.. అన్నీ అర్హతలు ఉన్నా కూడా ఎందుకు ఆయన రాజకీయాల్లోకి వెళ్లటం లేదో అర్థం కావటం లేదన్నారు. నాలుగు అర్హతలు ఉన్నాయని.. వాటిని వివరించి మరీ చెప్పారు.

ఆర్.నారాయణమూర్తి రాజకీయ అర్హతలు ఇలా ఉన్నాయి :

… భార్య, పిల్లలు, కుటుంబ బాధ్యతలు లేవు.

… నిరాడంబర జీవి. ఎలాంటి ఆర్భాటాలు కోరుకోరు. అతి సామాన్యంగా బతికేస్తారు.

… ప్రజల కోసమే సినిమాలు తీస్తారు.. ప్రజల సమస్యలపైనే మాట్లాడతారు.. నిత్యం సమాజం కోసం ఆలోచించే వ్యక్తి

… ఆయన నడుస్తున్న గూగుల్. భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, ఆర్థిక, సామాజిక అవగాహన ఉన్న వ్యక్తి. గూగుల్ లేకుండానే అన్నీ అనర్గళంగా చెప్పేస్తారు.

ఒక్క క్వాలిఫికేషన్ ఉంటేనే రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు.. అలాంటిది నాలుగు అర్హతలు ఉన్న ఆర్.నారాయణమూర్తి రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. మార్పు రాజకీయాల ద్వారా సాధ్యం అని.. అధికారం అనే బెత్తం చేతిలో ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ సినిమా రీ-రిలీజ్ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు కీరవాణి..

Posted in Uncategorized

Latest Updates