సినీ ఇండస్ట్రీ మొత్తం బ్రోకర్ల రాజ్యంలా మారిపోయింది : మహిళా ఆర్టిస్టులు

Sri-Reddy--Casting-couchతెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితిపై గళమెత్తింది మహిళా కార్మిక జేఏసీ. ఇదే ఇష్యూపై ఆదివారం (ఏప్రిల్-15) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు, మహిళల విషయంలో పెద్దలు చూపిస్తున్న వివక్షను ఆపేయాలని డిమాండ్ చేశారు ఆర్టిస్టులు. షూటింగ్ సమయంలో మహిళల కోసం కనీస సౌకర్యాలు కల్పించరనీ, తమను మనుషులుగా కూడా పరిగణించరని ఆవేదన వ్యక్తం చేశారు.

వేరే ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు కాబట్టే ఇండస్ట్రీలో ఉన్నామనీ, అడ్డగోలుగా మాట్లాడుతున్న వాళ్లంతా ఉద్యోగాలు ఇస్తే చేసుకునేందుకు మేము సిద్ధమే అన్నారు నటి అపూర్వ. సినిమాల్లో సమస్యలు పరిష్కరించే హీరోలు,.. అమ్మాయిలంతా రోడ్డెక్కి న్యాయం కావాలంటుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇండస్ట్రీ మొత్తం బ్రోకర్ల రాజ్యంలా మారిపోయిందన్నారు ఇంకొందరు ఆర్టిస్టులు.

లక్షలు కట్టి గుర్తింపు కార్డు తెచ్చుకుంటే.. మధ్యలో బ్రోకర్లు వచ్చి డబ్బు ఎగురేసుకుపోతున్నారనీ, ఈ అన్యాయంపై మాట్లాడితే అసోసియేషన్ నుంచి బయటకు పంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు. తెరవెనుక జరిగే బాగోతాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడాలని డిమాండ్ చేశారు. సినిమా రంగంపై ఆశతో వస్తున్న కళాకారులను.. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఆగం పట్టిస్తున్నారని ఆరోపించారు అమ్మాయిలు. ఈవిషయంలో ప్రభుత్వాలు కల్పించుకుని తమకు న్యాయంచేయాలని డిమాండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates