సినీ ఇండస్ట్రీ లెజెండరీ నిర్మాత రాఘవ కన్నుమూత

సినీ ఇండస్ట్రీ లెజెండరీ నిర్మాత కోటిపల్లి రాఘవ(105) ఇకలేరు. హైదరాబాద్ , జూబ్లీహిల్స్‌ లోని ఆయన నివాసంలో మంగళవారం(జూలై-31) గుండెపోటుతో మృతి చెందారు. 1913 డిసెంబర్‌ 9న జన్మించిన కే.రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. ఆయన ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌ పై 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యహరించారు. తరంగిణి, తూర్పు పడమర వంటి పలు చిత్రాలు అందించిన రాఘవ.. 1972లో తాతమనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.

అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావుగోపాల్‌రావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలు, సుమన్‌, భానుచందర్‌ లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  సినీ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చిన రాఘవ .. 27 సినిమాలు నిర్మించగా, అందులో 25 మూవీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి (1).సుఖదుఃఖాలు, (భాగస్వామి), (2).జగత్ కిలాడీలు, (3). జగత్ జెట్టీలు, (4). జగత్ జెంత్రీలు, (5). తాత మనవడు, (6). సంసారం-సాగరం, (7). తూర్పు పడమర, (8). ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, (9). తరంగిణి, (10).సూర్యచంద్రులు, (11). చదువు సంస్కారం, (12).అంతులేని వింతకథ, (13). త్రివేణి సంగమం, (14). ఈ ప్రశ్నకు బదులేది, (15).యుగకర్తలు, (16).అంకితం. (17).నటుడిగా..(18).బాలనాగమ్మ, (19).చంద్రలేఖ. స్టంట్ మాస్టర్ గా ..(20).పల్నాటి యుద్ధం, (21).పాతాళ భైరవి, (22).రాజు పేద.  ప్రొడక్షన్ మేనేజర్‌ గా..(23). కీలుగుర్రం, (24). టార్జాన్ గోస్ ఇండియా – ఆంగ్లచిత్రం, (25).వీరపాండ్య కట్టబొమ్మన్ – తమిళచిత్రం, (26). భలే పాండ్య – తమిళచిత్రం, (27). దిల్ తేరా దీవానా –   లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించారు రాఘవ.

సినీ ప్రస్థానం

ఆరేళ్ల వయసులో రాఘవ ఇంటిలో నుండి పారిపోయి కలకత్తాలో ఈస్టిండియా ఫిలిం కంపెనీలో ట్రాలీ పుల్లర్‌ గా చేరాడు. తరువాత నిర్మాత మోతీలాల్ చమ్రియా వద్ద అసిస్టెంట్‌ గా, కస్తూరి శివరావు వద్ద అసిస్టెంట్‌ గా, రఘుపతి వెంకయ్య నాయుడు వద్ద ఆఫీస్ బాయ్‌ గా, టంగుటూరి ప్రకాశంవద్ద క్లీనర్‌ గా, మిర్జాపురం రాజావారి శోభనాచల స్టూడియోలో ఫిలిం డెవలపర్‌ గా, సి.పుల్లయ్య వద్ద ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటులో ఇలా పలుచోట్ల పలురకాల పనిచేశాడు. జెమినీ స్టూడియోస్ నిర్మించిన సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేశాడు. పాతాళ భైరవి, రాజు పేద సినిమాలకు స్టంట్ మాస్టర్‌ గా పనిచేశాడు. ఎం.జి.ఎం.స్టూడియో వాళ్ళు టార్జాన్ గోస్ ఇండియా ఆంగ్ల చిత్రం తీస్తూ ఎక్కువ భాషలు తెలిసిన ప్రొడక్షన్ మేనేజర్‌ కోసం వెదికి ఏడు భాషలు తెలిసిన రాఘవను ఆ ఉద్యోగంలో నియమించారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఇతడు రోమ్‌ నగరానికి కూడా వెళ్లే అవకాశం దక్కింది. ఈ సినిమా ద్వారా రాఘవ 20వేల డాలర్లు పారితోషికం పొందాడు.

చిత్ర నిర్మాణం

రోమ్‌ లో ఉన్నప్పుడు రవ చూసిన ఇంగ్లీషు సినిమాల ప్రేరణతో తెలుగులో సినిమాలు తీయాలనే కోరిక కలిగింది. చేతిలో 20 వేల డాలర్లు ఉండడంతో ఏకాంబరేశ్వరరావు, సూర్యచంద్ర అనే మరో ఇద్దరు భాగస్వాములతో ఫల్గుణ ఫిలిమ్స్ సంస్థను నెలకొల్పి జగత్ కిలాడీలు అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా విజయవంతం కావడంతో జగత్ జెట్టీలు, జగత్ జెంత్రీలు నిర్మించాడు. తరువాత ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి దాసరి నారాయణరావును దర్శకునిగా పరిచయం చేస్తూ ..తాత మనవడు చిత్రాన్ని నిర్మించాడు. కోడి రామకృష్ణను, రచయిత రాజశ్రీని, గుహనాథన్‌, కె.ఆదిత్య, కొమ్మినేని కృష్ణమూర్తి, బందెల ఈశ్వరరావులను దర్శకులుగా సినిమాలలో తొలి అవకాశం ఇచ్చాడు.

మంగళవారం జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates