సినీ నటుడి కుమారుడు భారత్ కు మెడల్ తెచ్చాడు

madavan sonనటుడు మాధవన్‌ కొడుకు వేదాంత్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో భారత్ తరపున కాంస్య పతకం సాధించాడు. థాయ్‌లాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో వేదాంత్‌ పాల్గొన్నాడు. ఈ విషయాన్ని మాధవన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపాడు. నాకు, నా భార్య సరితకు ఇది గర్వించదగ్గ విషయం… మా అబ్బాయి వేదాంత్‌ థాయ్‌లాండ్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో భారత్‌కు కాంస్యం సాధించిపెట్టాడు’ అని ట్వీట్‌ చేసాడు. కాంస్యం సాధించడంపై సినీప్రముఖులు వేదాంత్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates